ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రద్దు
- అనకాపల్లిలో ఈ తెల్లవారుజామున ఘటన
- తాడి–అనకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య దెబ్బతిన్న ట్రాక్
- పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది
జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ తో పాటు రత్నాచల్– ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా ఈ రోజు రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ జూన్ 15న కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంది. మరోవైపు రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను శరవేగంగా చేపడుతున్నారు.