CBI: మనీలాండరింగ్ కేసులో డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్

CBI arrests Deccan Chronicle chairman Venkattram Reddy
  • వెంకట్రామిరెడ్డిపై హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలు
  • బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించినట్టు అభియోగాలు
  • గతంలో రూ.3,300 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హవాలా, మనీలాండరింగ్ కేసులో వెంకట్రామ్‌రెడ్డితోపాటు మణి అయ్యర్‌ను కూడా హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. పలు బ్యాంకుల నుంచి రూ. 8,800 కోట్ల రుణం తీసుకున్న వెంకట్రామ్‌రెడ్డి వాటిని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతోపాటు దారి మళ్లించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

దీనిపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగా తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది. గతంలో ఆయనకు చెందిన రూ.3,300 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
CBI
Deccan Chronicle
Venkattram Reddy
ED

More Telugu News