MK Stalin: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ.. కారులో తలపట్టుకుని విలపించిన మంత్రి వీడియో వైరల్!

Tamil Minister Senthil Balaji arrested by ED in money laundering case
  • ‘క్యాష్ ఫర్ జాబ్’ కేసులో మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
  • సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసిన అధికారులు
  • గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రి బయట ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరింపు
  • సీనియర్ మంత్రులతో సీఎం స్టాలిన్ భేటీ
తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. ‘క్యాష్ ఫర్ జాబ్’ మనీలాండరింగ్ కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ మంత్రిని సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. తనను అరెస్ట్ చేయడంతో బాలాజీ కారులో కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహించిన సరిగ్గా 24 గంటల తర్వాత ఆయనను అధికారులు అరెస్ట్ చేశారు. 

ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారుల నుంచి సమాచారం అందింది. ఆ తర్వాత తనకు గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో మంత్రిని చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బయట ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమికూడడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఆసుపత్రి బయట ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. 

మంత్రిని ఐసీయూకు తరలించిన వైద్యులు ఈసీజీ సహా పలు పరీక్షలు నిర్వహించారు. సెంథిల్ బాలాజీకి చికిత్స కొనసాగుతోందని మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. బీజేపీ రాజకీయాలకు తాము భయపడే ప్రస్తక్తే లేదని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంత్రి బాలాజీ అరెస్ట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీనియర్ మంత్రులు, లీగల్ టీంతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. కాగా, ఈడీ దాడులను స్టాలిన్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
MK Stalin
Tamil Nadu
Senthil Balaji
DMK
ED

More Telugu News