Kangana Ranaut: యాక్షన్ సినిమాలకు పక్కాగా సిద్ధమవుతున్న కంగన.. వీడియో ఇదిగో

Kangana Ranaut gets back to her exercise routine after two years preps for new action film
  • ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగన
  • తలైవి సినిమా కోసం మధ్యలో బరువు పెరిగిన కథానాయిక
  • తిరిగి ఫిట్ నెస్ కోసం కఠోర సాథన

బాలీవుడ్ వెర్సటైల్ కథానాయిక కంగనా రనౌత్ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ఎక్సర్ సైజ్ లు మొదలు పెట్టింది. యాక్షన్ పాత్రల్లో సులువుగా ఒదిగిపోయేందుకు వీలుగా కఠినంగా సాధన చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో థియేటర్ల ముందుకు రానుంది.

ఇన్ స్టాలో కంగనా షేర్ చేసిన వీడియోను చూస్తే, ఆమె ఎంతలా సాధన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నల్లటి స్పోర్ట్స్ సూట్ వేసుకున్న ఆమె జిమ్ లో ఇన్ స్ట్రుమెంట్లతో కసరత్తు చేస్తోంది. 36 ఏళ్ల వయసులోనూ ఆమె చలాకీగా చేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ‘‘రోజువారీ ఎక్సర్ సైజులకు విరామం చెప్పిన రెండేళ్ల తర్వాత..  మిసెస్ గాంధీ పాత్రను పోషిస్తున్నాను. దాంతో తిరిగి నా రోజువారీ ఫిట్ నెస్ సు ప్రారంభించాను. రానున్న యాక్షన్ సినిమా ద్వారా గొప్ప పరివర్తన కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె పోస్ట్ పెట్టింది.  (కంగనా ఇన్ స్టా వీడియో కోసం)

దీనికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తొలిగా స్పందించారు. ‘‘నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు. నీవు విజయం సాధించాలి’’ అంటూ కామెంట్ చేశారు. కఠోర సాధనను అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత పాత్రతో కూడిన తలైవి సినిమా కోసం కంగనా కొంచెం బరువు పెరిగింది. ఇందుకోసం 25 కిలోల వరకు బరువు పెరిగిన ఆమె, తిరిగి తన పట్టుదలతో దాన్ని కరిగించేసింది.

  • Loading...

More Telugu News