Student death: హైదరాబాద్ లో నారాయణ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

 Student dead after falling from hostel building in Hyderabad
  • నారాయణ కాలేజ్ క్యాంపస్ లో కలకలం
  • హాస్టల్ బిల్డింగ్ పై నుంచి కిందపడడంతో దుర్మరణం
  • వారం రోజుల క్రితమే క్యాంపస్ లో చేరిన విద్యార్థిని

హైదరాబాద్ లోని బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. నారాయణ కాలేజీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో చనిపోయింది. కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. క్యాంపస్ లో చేరిన వారం రోజులకే విద్యార్థిని మరణించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక అనే విద్యార్థిని బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో చేరింది. ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్ తీసుకున్న వంశిక.. వారం రోజుల క్రితమే హాస్టల్ కు వచ్చింది.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందపడింది. ఐదు అంతస్తుల నుంచి పడడంతో తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే చనిపోయింది. అయితే, వంశిక ప్రమాదవశాత్తూ జారి పడిందా? లేక ఆత్మహత్య చేసుకుందా?.. మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలియరాలేదు. వారం రోజుల క్రితమే క్యాంపస్ లో చేరిన విద్యార్థిని ఇంతలోనే విగతజీవిగా మారడంపై స్థానికులు, పేరెంట్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వంశిక మృతిపై అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News