CSK opener: నా నిశ్చితార్థం చెన్నై ప్రజలకు అంకితం: రుతురాజ్ గైక్వాడ్

CSK opener Ruturaj Gaikwad dedicates his engagement to Chennai people
  • ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టిన రుతురాజ్ గైక్వాడ్
  • ఇటీవలే ఉత్కర్ష పవార్ తో వివాహం
  • చెన్నై తనకు ఎంతో ఇచ్చిందన్న క్రికెటర్
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ప్రజలకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని చెన్నై ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ తన రాష్ట్రానికే చెందిన మహిళా క్రికెటర్ ఉత్కర్ష పవార్ ను జూన్ 3న మహాబలేశ్వర్ లో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. 

తాజాగా రుతురాజ్ గైక్వాడ్ రుతు, ఉత్కర్ష పేరుతో ఉన్న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ‘‘ఉత్కర్ష మొదటి నుంచి నా జీవితంలో, నా ప్రయాణంలో భాగంగా ఉంది. నా జీవితంలో అన్ని ముఖ్య విషయాల గురించి ఆమెకు తెలుసు. సంప్రదాయ మహారాష్టియన్ ఎంగేజ్ మెంట్ ను చెన్నై ప్రజలకు, దక్షిణాది సంస్కృతికి అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ పట్టణానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ నా జీవితానికి ఎంతో చేసింది. ఐ లవ్ యూ ఉత్కర్ష’’ అంటూ రుతురాజ్ పోస్ట్ లో పేర్కొన్నాడు. 

ఉత్కర్ష పవార్ దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరఫున ఆడింది. పూకు చెందిన ఆమె చాలా ఏళ్లుగా రుతురాజ్ గైక్వాడ్ తో ప్రేమ బంధం నడుపుతోంది. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై జట్టులో కీలక ఆటగాడనే విషయం తెలిసే ఉంటుంది. ధోనీ మాదిరే సీఎస్కేలోని ఇతర కీలక ప్లేయర్ల పట్ల చెన్నై ప్రజలు తెగ అభిమానం కురిపిస్తుంటారు. అందుకే గైక్వాడ్ ఈ ప్రకటన చేస్తూ తన అభిమానాన్ని సైతం చాటుకున్నట్టు కనిపిస్తోంది.
CSK opener
Ruturaj Gaikwad
engagement
dedicates
Chennai people

More Telugu News