Team India: టీమిండియా వెస్టిండీస్ పర్యటన... షెడ్యూల్ విడుదల

Indias tour of West Indies 2023 schedule
  • జులై - ఆగస్ట్ లో టీమిండియా... వెస్టిండీస్ పర్యటన
  • రెండు జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు
  • సోమవారం రాత్రి షెడ్యూల్ విడుదల

జులై - ఆగస్ట్ లో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం రాత్రి విడుదల చేసింది.

జులై 12 నుండి 16 మధ్య డొమినికాలోని విండ్సర్ పార్కులో తొలి టెస్ట్, జులై 20-24 మధ్య ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ లో రెండో టెస్ట్ జరగనుంది. జులై 27 - ఆగస్ట్ 1 మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహిస్తారు. ఆగస్ట్ 3, 6, 8, 12, 13 తేదీలలో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News