Nara Lokesh: రాయలసీమలో గత పాదయాత్రల రికార్డులను తిరగరాసిన లోకేశ్

Lokesh rewrites records by his Yuvagalam Padayatra
  • జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్
  • రాయలసీమలో 124 రోజుల సుదీర్ఘ సమయం పాటు పాదయాత్ర
  • మరే నాయకుడు తిరగనన్ని నియోజకవర్గాల్లో లోకేశ్ యువగళం
  • సీమలో 44 నియోజకవర్గాలు చుట్టేసిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర రికార్డులు బద్దలు కొడుతున్నారు. రాయలసీమలో గత పాదయాత్రల రికార్డును లోకేశ్ తిరగరాశారు. లోకేశ్ రాయలసీమలో 124 రోజుల సుదీర్ఘ సమయం పాటు పాదయాత్ర చేశారు.

గతంలో మరే నాయకుడు తిరగనన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాలకు గాను లోకేశ్ 44 నియోజకవర్గాల్లో యువగళం చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14కి 14 నియోజకవర్గాల్లో నడిచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో 14కి 9 నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 నియోజకవర్గాలు తిరిగారు. 

రాయలసీమలో ఇప్పటివరకు లోకేశ్ 1,587 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యువగళంలో భాగంగా 108 మండలాలు, 943 గ్రామాల్లో లోకేశ్ పర్యటించారు.
Nara Lokesh
Records
Yuva Galam Padayatra
Rayalaseema
TDP
Andhra Pradesh

More Telugu News