COVID19: కొవిన్ డేటా లీకేజ్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందన

Government CoWIN data leak
  • కొవిన్ పోర్టల్ సురక్షితమని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • డేటా లీక్ వార్తలు అవాస్తవమంటూ కొట్టివేత
  • పోర్టల్ లో సమాచారం అత్యంత గోప్యంగా ఉందని వెల్లడి

కొవిన్ డేటా లీక్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన కొవిన్ పోర్టల్ లోని సున్నితమైన సమాచారం లీక్ అయిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కొవిన్ పోర్టల్ సురక్షితమని, డేటా లీక్ వార్తలు అవాస్తవమంటూ కొట్టి పారేసింది. ఈ పోర్టల్ లో సమాచారం అత్యంత గోప్యంగా ఉందని తెలిపింది. ఎలాంటి ఆధారం లేకుండా లీకైనట్లు ప్రచారం జరిగిందని వెల్లడించింది. ఈ మేరకు ఘటనపై నివేదిక అందించాలని సీఈఆర్‌టీని కేంద్రం కోరింది.

  • Loading...

More Telugu News