Mallareddy: 'తెలంగాణ రన్'లో మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Minister Mallareddy dance in Telangana Run programm at peerzadiguda
  • ఫిర్జాదిగూడలో తెలంగాణ రన్ కార్యక్రమం
  • వేదికపై కాలు కదిపిన మంత్రి మల్లారెడ్డి 
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెంగాణ రన్ కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తెలంగాణ రన్‌ ప్రారంభమైంది. ఇందులో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హీరోయిన్ శ్రీలీల, సింగర్ మంగ్లీ, ఈషాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మరోపక్క, మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. వేదికపై ఆయన స్టెప్పులేసి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. వేదిక ఏదైనా సరే మంత్రి మల్లారెడ్డి ఉన్నారంటే ఉత్సాహం ఉప్పొంగాల్సిందేనని నిరూపించారు. మంత్రి డ్యాన్స్ తో అక్కడ ఉన్నవారు కూడా ఉత్సాహంగా కాలుకదిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mallareddy
minister dande
mallareddy dance
Viral Videos
Telangana
telangana run
peerzadiguda

More Telugu News