Bhushan: నాగభూషణం మనవడిగా గుర్తింపు కోరుకోవడం లేదు: భూషణ్

Bhushan Interview
  • నటనకి తొలి ప్రాధాన్యత ఇస్తానన్న భూషణ్ 
  • డైరెక్షన్ పట్ల ఆసక్తి ఉందని వెల్లడి 
  • కుటుంబ నేపథ్యం చెప్పుకోనని వ్యాఖ్య 
  • టాలెంట్ తో నిలబడాలని ఉందని వివరణ

తెలుగు సినిమాకి కొత్త విలనిజాన్ని చూపించిన నటుడు నాగభూషణం. ఆయన మార్క్ కామెడీని ఆ తరువాత ఎవరూ అనుసరించలేకపోయారు .. అదే ఆయన ప్రత్యేకత. ఆయన కూతురు కొడుకు భూషణ్ ఒక వైపున నటుడిగా .. మరో వైపున దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 

తాజా ఇంటర్వ్యూలో భూషణ్ మాట్లాడుతూ ... "నటుడిగా కొనసాగడమే నాకు ఇష్టం. దర్శకత్వం అనేది నా హాబీ మాత్రమే. నాకు సమయం దొరికినప్పుడల్లా డైరెక్షన్ గురించిన ఆలోచన చేస్తుంటాను. మీర్ గారి కొడుకు .. నాగభూషణంగారి మనవడు అనగానే, అవతలివారు నాకు ఛాన్స్ ఇవ్వడానికి అంగీకరిస్తారు. కానీ అలాంటి గుర్తింపును నేను కోరుకోవడం లేదు" అన్నాడు. 

"కుర్రాడు బాగున్నాడు .. బాగా చేస్తున్నాడు .. అని అంతా అనుకుంటే అదే నాకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది. ఏ విషయంలోనైనా నా ప్రయత్నం నేను చేస్తూ వెళతాను .. ఆ తరువాత లక్ పై వదిలేస్తాను. నా డైరెక్షన్లో నేను హీరోగా చేసే ఆలోచన లేదు. తెరపై నేను ఎలా కనిపిస్తే బాగుంటుందనేది, నా కంటే వేరే డైరెక్టర్స్ కి ఎక్కువగా తెలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News