Sireesha: కాళ్లు, చేతుల నరాలు కోసి... కళ్లు పెకలించి... యువతి దారుణ హత్య

Paramedic student murdered in brutal way
  • వికారాబాద్ జిల్లాలో ఘోరం
  • హత్యకు గురైన పారామెడికల్ విద్యార్థిని
  • నీటి కుంటలో మృతదేహం
వికారాబాద్ జిల్లాలో ఓ యువతి అత్యంత దారుణ రీతిలో హత్యకు గురైంది. యువతి కాళ్లు, చేతుల నరాలు కోసేసి, కళ్లు రెండు పెకలించిన రీతిలో యువతి మృతదేహం పరిగి మండలం కాలాపూర్ లో లభ్యమైంది. ఆమెను హత్య చేసిన అనంతరం ఓ నీటి కుంటలో పడేశారు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన యువతిని శిరీషగా గుర్తించారు. 

19 ఏళ్ల శిరీష ఇంటర్ పూర్తి చేసుకుని పారామెడికల్ కోర్సులో చేరింది. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె విగతజీవురాలిగా కనిపించడంతో శిరీష తల్లిదండ్రులు తీవ్ర విషాదానికి గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

శిరీష హత్యకు గురైందన్న సమాచారంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హత్య సమయంలో స్కూడ్రైవర్ తో శిరీష కళ్లల్లో పొడిచినట్టు భావిస్తున్నారు. ఇంత కిరాతకంగా ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Sireesha
Murder
Vikarabad District
Police
Telangana

More Telugu News