Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచే స్కూళ్లు ప్రారంభం

From tommorow schools reopening in Andrapradesh
  • ఈ నెల 17 వరకు ఒంటిపూట నిర్వహణ
  • ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 11:30 గంటలకే క్లోజ్
  • సెలవులు పొడిగించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం రాగి జావ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో స్కూళ్ల పున:ప్రారంభాన్ని వాయిదా వేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

జూన్ రెండో వారం గడిచినా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు స్కూళ్లకు వెళ్లే క్రమంలో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా సెలవుల పొడిగింపుపై మరోసారి ఆలోచించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News