BRS: విభజన తర్వాత అధఃపాతాళంలో ఏపీ: తోట చంద్రశేఖర్

AP BRS Chief Says Telangana now in number 1 in India
  • ఆత్మీయ సన్మానం అందుకున్న ఏపీ బీఆర్ఎస్ చీఫ్
  • విభజన తర్వాత తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్న తోట చంద్రశేఖర్
  • అపార వనరులున్నా ఏపీ వెనకబడిపోయిందని ఆవేదన

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అధఃపాతాళానికి పడిపోయిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రా సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రగతి నగర్‌లోని పుచ్చలపల్లి లీలా సుందరయ్య ఫంక్షన్ హాలులో నిన్న ఆయన ఆత్మీయ సన్మానం అందుకున్నారు. 

అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విభజన తర్వాత తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. ఏపీలో అద్భుత వనరులు, అపార ఖనిజ సంపదలున్నప్పటికీ సరైన పాలనా దక్షత లేని  కారణంగా రాష్ట్రం అధఃపాతాళానికి పడిపోయిందని అన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మేయర్ కొలను నీలారెడ్డి, పార్టీ నిజాంపేట నగరశాఖ అధ్యక్షుడు వి.రంగరాయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News