Warangal Urban District: రైలు కిందపడబోయిన ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్

  • మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌లో ఆగుతున్న సమయంలో ఘటన
  • రైలు ఆగుతున్న క్రమంలో కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ
  • పట్టు తప్పి ప్లాట్‌ఫాంపై పడిపోయిన వైనం 
  • తలుపు హ్యాండిల్ వదలకపోవడంతో మహిళను ఈడ్చుకెళ్లిన రైలు
  • కానిస్టేబుల్ సోనాలి ప్రయాణికురాలిని ప్లాట్‌ఫాంవైపు లాగడంతో తప్పిన ముప్పు
Female constable saves woman who fell on platform while getting down from train in warangal station

కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదంలో పడ్డ ఓ ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్( నెంబర్ 12746) శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. రైలు నెమ్మదిగా ఆగుతున్న సమయంలో ఓ మహిళ కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పట్టు జారడంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడిపోయారు. 

అయితే, మహిళ భయంతో రైలు తలుపు వద్ద ఉన్న హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకున్నారు. ఫలితంగా, ఆమెను రైలు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన మహిళా కానిస్టేబుల్ సోనాలీ ఎం మొలాకే పరుగున వచ్చి ప్రయాణికురాలిని ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాంవైపు లాగి కాపాడారు. కానిస్టేబుల్ గమనించి ఉండకపోతే ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయేది. కాగా, విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సోనాలీని ఉన్నతాధికారులు అభినందించారు. 


More Telugu News