Nara Lokesh: ​రైతులను ఆదుకోవడానికి నా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి: నారా లోకేశ్

  • రాజంపేట నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • యువగళానికి నేటితో 122 రోజులు పూర్తి
  • 11 కిమీ పాటు లంకమల అభయారణ్యంలో నడిచిన లోకేశ్
  • అట్లూరు క్రాస్ వద్ద లోకేశ్ కు స్వాగతం పలికిన బద్వేలు నేతలు
Nara Lokesh said he has some ideas to save farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర బద్వేలు నియోజకవర్గంలో శనివారం ఉత్సాహంగా సాగింది. 122వ రోజు యువగళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గం జంగాలపల్లె క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. జంగాలపల్లి క్యాంప్ సైట్ వద్ద ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం లోకేశ్ పాదయాత్రకు బయలుదేరారు. 

వందలాది కార్యకర్తలు, నాయకులు వెంట రాగా 11 కి.మీ. పాటు లంకమల అభయారణ్యంలో లోకేశ్ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు. అనంతరం అట్లూరు క్రాస్ వద్దకు చేరుకోగానే బద్వేలు టీడీపీ నేతలు రితేష్ రెడ్డి, జయమ్మ, కౌవల్యారెడ్డి, నారాయణరెడ్డి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొక్కజొన్న పొత్తులతో తయారు చేసిన గజమాలతో లోకేశ్ ను పార్టీ నేతలు సత్కరించారు. 

లోకేశ్ పాదయాత్రకు మేకపాటి సంఘీభావం

కాగా, లోకేష్ పాదయాత్రకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అట్లూరులోని భోజన విరామకేంద్రంలో లోకేశ్ తో సమావేశమైన చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించారు. 

భోజన విరామం నుండి పాదయాత్ర కొనసాగించిన యువనేత రెడ్డిపల్లిలో చినీపంటను పరిశీలించి, దిగుబడి, పెట్టుబడుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కొండూరు, బాలిరెడ్డిబావి మీదుగా నబియాబాద్ కు చేరుకున్న లోకేశ్ విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు. 

వైసీపీ దొంగల ఇసుక దాహం... రాష్ట్ర ప్రజలకు శాపం!

జంగాలపల్లె వద్ద పోగేసిన ఇసుక డంపింగ్ వద్ద సెల్ఫీ దిగిన నారా లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది పెన్నానదిని తోడేసి వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డు అని వెల్లడించారు. 

"పెన్నానది పక్కనే ఉన్నా స్థానిక ప్రజలకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండటం లేదు. బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు ఇక్కడ ఇసుక తరలించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా ఎస్ఈబీ అధికారులకు కనపడదు. జగన్ రెడ్డి పాపాల పుట్ట మాదిరి పెరిగిపోతున్న ఈ ఇసుక మేట రాష్ట్రంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాకు ప్రత్యక్షసాక్షి" అని లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చీనీ పంటను పరిశీలించిన నారా లోకేశ్ 

బద్వేలు నియోజకవర్గం రెడ్డిపల్లిలో పాదయాత్ర సందర్భంగా చీనీతోటను యువనేత లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చీనీ రైతు రైతుతో మాట్లాడి చీనీ రైతులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం లోకేశ్ స్పందిస్తూ... మిషన్ రాయలసీమ కార్యక్రమంలో రైతుల సమస్యలు పరిష్కారం చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకు కావాల్సిన చీనీ రకాలు పెంచేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గేలా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అన్ని తక్కువ ధరకు అందజేస్తామని హామీ ఇచ్చారు. 

"గిట్టుబాటు ధర కల్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే డ్రిప్ సబ్సిడీలో అందజేస్తాం. కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. చీనీ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. మరో ఏడాది ఓపిక పట్టండి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చీనీ రైతుల్ని ఆదుకుంటాం. రైతుల్ని ఆదుకోవడానికి నా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తాను" అని రైతు రామకృష్ణారెడ్డికి భరోసా ఇచ్చిన లోకేశ్  భరోసా ఇచ్చారు.

యువగళం వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1556.7 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 17.7 కి.మీ.

123వ రోజు పాదయాత్ర వివరాలు (11-6-2023):

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):

మధ్యాహ్నం

2.00 – నదియాబాద్ క్యాంప్ సైట్ లో రైతులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – నదియాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.15 – సోమేశ్వరపురంలో రైతులతో భేటీ.

4.45 – ఎర్రబల్లెలో విద్యార్థులతో సమావేశం.

5.05 – అప్పరాజుపేటలో గ్రామస్తులతో భేటీ.

5.15 – రాజుపాలెంలో స్థానికులతో సమావేశం.

5.45 – వెంకటశెట్టిపల్లిలో స్థానికులతో భేటీ.

6.30 – కొంగలవీడులో స్థానికులతో సమావేశం.

6.40 – శివరాంనగర్ లో రైతులతో భేటీ.

6.45 – శంకరాపురం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

6.55 – గొడుగునూరులో స్థానికులతో సమావేశం.

7.05 – చింతలచెరువు క్రాస్ వద్ద గ్రామస్తులతో భేటీ.

7.15 – బయ్యనపల్లిలో స్థానికులతో సమావేశం.

7.45 – అబ్బూసాహెబ్ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

8.15 – బద్వేలు శివారు విద్యానగర్ విడిది కేంద్రంలో బస.


More Telugu News