YS Avinash Reddy: అవినాశ్ రెడ్డిని ఏడు గంటల పాటు విచారించిన సీబీఐ

  • వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా కడప ఎంపీ
  • ఇటీవల అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, పూచీకత్తుపై విడుదల చేసిన సీబీఐ
  • ముందస్తు బెయిల్ సమయంలో ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
  • ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరు
Avinash Reddy grilled for seven hours in YS Viveka murder case

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసిన సీబీఐ రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులపై ఆ వెంటనే విడుదల చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాలి. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు విచారణకు హాజరయ్యారు.

More Telugu News