Train Accident: ఒడిశా రైలు ప్రమాదం... బహనగా స్టేషన్ ను సీజ్ చేసిన సీబీఐ

  • ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో విచారణలో భాగంగా సీబీఐ సీజ్
  • పాసింజర్ ట్రైన్స్, గూడ్స్ రైళ్లు ఏవీ ఆగవని అధికారుల వెల్లడి
  • సీజ్ నేపథ్యంలో సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించేందుకు అవకాశం లేదని వెల్లడి
CBI seals Bahanaga Bazar railway station

ఒడిశా ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకమా? లేక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? అనే విషయాన్ని వెలికితీసేందుకు సీబీఐ విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా సీబీఐ ఇక్కడి బహనగా రైల్వే స్టేషన్ ను సీజ్ చేసింది. స్టేషన్ లాగ్ బుక్, రిలే ఇంటర్ లాకింగ్ ప్యానెల్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. సీజ్ నేపథ్యంలో బహనగా రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగదని రైల్వే అధికారులు ప్రకటించారు. 

ఇక్కడ ఏడు పాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి. ఇప్పుడు సీజ్ నేపథ్యంలో వీటితో పాటు గూడ్స్ రైళ్లు కూడా ఆగవు. రిలే ఇంటర్ లాకింగ్ ప్యానెల్ ను స్వాధీనం చేసుకున్నందున సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించేందుకు స్టేషన్ సిబ్బందికి అవకాశం లభించదని, కాబట్టి తదుపరి నోటీసులు అందే వరకు స్టేషన్ లో ఏ రైలు ఆగదని అధికారులు తెలిపారు.

More Telugu News