Rajinikanth: 170వ సినిమాలో అమితాబ్ తో స్క్రీన్ ను పంచుకుంటున్న రజనీకాంత్

Rajinikanth shares screen with Amitabh Bachchan in his 170th movie
  • టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ కొత్త ప్రాజెక్టు
  • రజనీ కెరీర్ లో ఇది 170వ చిత్రం
  • అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత కలిసి నటిస్తున్న రజనీ, అమితాబ్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అన్ స్టాపబుల్ అనే రీతిలో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా రజనీ 170వ సినిమాకు రంగం సిద్ధమైంది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన 170వ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 

కాగా, ఈ చిత్రంలో మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత మరోసారి అమితాబ్ తో కలిసి రజనీ స్క్రీన్ పంచుకోనున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు, తారాగణం డిటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం రజనీ 'జైలర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News