Bellamkonda Suresh: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కారు అద్దాలు పగులగొట్టి చోరీ!

Theft in film producer Bellamkonda Suresh car
  • జర్నలిస్ట్ కాలనీలోని తన కార్యాలయం వద్ద కారును పార్క్ చేసిన సురేశ్
  • రూ. 50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
  • ఒక్కో మద్యం బాటిల్ ఖరీదు రూ. 28 వేలు ఉండొచ్చని సమాచారం
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కారులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆయన కారు అద్దాలను పగులగొట్టి వాహనంలో ఉన్న నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. నిన్న ఉదయం విషయాన్ని గ్రహించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన కార్యాలయం ముందు గురువారం మధ్యాహ్నం బెల్లంకొండ సురేశ్ తన కారును పార్క్ చేశారు. నిన్న ఉదయం చూడగా కారుకు ఎడమవైపు ఉన్న అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. కారులో చూడగా అందులో ఉన్న రూ. 50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమయ్యాయి. ఒక్కో మద్యం బాటిల్ ఖరీదు రూ. 28 వేల రూపాయలని తెలుస్తోంది. ఈ చోరీకి సంబంధించి సురేశ్ ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bellamkonda Suresh
Car
Theft

More Telugu News