google: గూగుల్ కీలక నిర్ణయం... ఈ విండోస్ వెర్షన్స్‌కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత!

  • ఆగస్ట్ 2023 నుండి ఈ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటన
  • విండోస్ 8 ఓఎస్ వినియోగించే యూజర్లు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచన
  • సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం
Google drive to discontinue App support for these windows versions

గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది! మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్ 2012 యూజర్లకు ఇకపై గూగుల్ డ్రైవ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.

ప్రస్తుతం విండోస్ 8 ఓఎస్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ కంప్యూటర్లలో ఓఎస్ ను విండోస్ 10కు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. కాగా, గూగుల్ బ్రౌజర్ ద్వారా యూజర్లు డ్రైవ్ ను యాక్సెస్ చేసుకోవచ్చునని వెల్లడించింది. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

More Telugu News