ఉత్తరాఖండ్ లోని ఈ ఆలయాలకు మహిళలు షార్ట్స్‌తో వస్తే ప్రవేశం లేదంటున్న హిందూ ధర్మ సంస్థ!
- మహా నిర్వాణి అఖార హిందూ సంస్థ ప్రకటన
- తమ పరిధిలోని 3 దేవాలయాల్లోకి సంప్రదాయ దుస్తులతో రావాలని విజ్ఞప్తి
- నిబంధనలు పలు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అమల్లో ఉన్నట్లు వెల్లడి
తమ పరిధిలోని హరిద్వార్ కంఖాల్ లోని దక్ష ప్రజాపతి ఆలయం, పవూరి జిల్లాలోని నీలకంఠ మహదేవ్, డెహ్రాడూన్ లోని టపకేశ్వర్ మహదేవ్... ఈ మూడు ఆలయాల్లోకి సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని పేర్కొన్నారు. ఈ దేవాలయాలు మహా నిర్వాణి అఖారా పరిధిలో ఉన్నాయి. ఈ గుళ్లలో మహిళలు షార్ట్స్, ఫ్యాషన్ దుస్తులు ధరించి రావొద్దని కోరారు. ఈ నిబంధనలు ఇప్పటికే మహారాష్ట్ర, భారత్ లోని దక్షిణ ప్రాంతంలోని ఆలయాల్లో అమల్లో ఉన్నట్లు చెప్పారు. ఆలయాలు ఉన్నవి ఆధ్యాత్మిక ఉన్నతి కోసమని, అంతే తప్ప వినోదం కోసం కాదని వ్యాఖ్యానించారు.