అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఈడీ దాడులు: రాజస్థాన్ ముఖ్యమంత్రి
- ప్రశ్నా పత్రం లీకేజీ ఆరోపణలపై పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు
- కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందన్న సీఎం గెహ్లాట్
- అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి పని చేయవద్దని దర్యాప్తు సంస్ధలకు హితవు
ఈడీతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్ధలు కేంద్రం ఒత్తిడితో పని చేస్తున్నాయన్నారు. దేశంలో రాజ్యాంగానికి కాషాయ పాలకులు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఆయా రాష్ట్రాలకు దర్యాప్తు సంస్ధలను పంపుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి పని చేయవద్దని దర్యాప్తు సంస్ధలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్ రహిత భారత్ అని చెబుతుంటుందని, అయితే గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత అనీ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రాష్ట్రంలో తాము ప్రారంభించిన పథకాలను కొనసాగించేందుకు మళ్లీ తమను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.