mrigasira karthi: మృగశిరకార్తె చేపప్రసాదం: నాంపల్లి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

  • ఎగ్జిబిషన్ మైదానంలో అస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ
  • పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు 
  • ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు సూచన
Traffic restrictions in Hyderabad due to Mrigasira Karthi fish Prasadam

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. చేప ప్రసాదం కోసం తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. దీంతో ఎగ్జిబిషన్ మైదానం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు...

* మొజంజాహి మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ మైదానం వైపు వెళ్లే వాహనాలను అబిడ్స్ - జీబీవో - నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
* ఎంజె బ్రిడ్జి - బేగంబజార్ ఛత్రి నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్క టవర్స్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు.
* పీసీఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంపు, బీజీఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు. అయితే ఈ మార్గంలో అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.
* నాంపల్లి దిశగా కార్లలో వచ్చే వారు గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్ లో పార్కు చేసి అజంత గేట్ నుండి ఎగ్జిబిషన్ మైదానంలోకి రావాలి.
* వీఐపీ కారు పాస్ ఉంటే ఎంజే మార్కెట్ నుండి గాంధీ భవన్ వరకు వచ్చి ఎడమ వైపు తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ 1 నుండి రావాలి.
* నాంపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకొని గేట్ 1, సీడబ్ల్యుసీ గేట్ ద్వారా లోపలకు వెళ్లాలి.
* చేప ప్రసాదం అనంతరం వీఐపీ వాహనాలు వీఐపీ, సీడబ్ల్యుసీ గేట్ నుండి అదాబ్ హోటల్ నుండి నాంపల్లి మీదుగా బయటకు వెళ్లాలి.

More Telugu News