Bollywood: ఓ మై గాడ్.. అక్షయ్ లుక్ అదుర్స్!

Akshay Kumar drops new poster of Oh My God 2 reveals release date
  • ఓ మై గాడ్2లో శివుడిగా కనిపించనున్న అక్షయ్
  • ఆగస్టు 11న విడుదల కానున్న చిత్రం
  • తొమ్మిదేళ్ల కిందట వచ్చిన ఓఎంజీ1 సూపర్ హిట్
అక్షయ్ కుమార్ హీరోగా తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన ‘ఓ మై గాడ్’ చిత్రం అప్పట్లో సంచలన విజయం సొంతం చేసుకుంది. ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లతో ఎన్నో ఘనతలు సాధించింది. ఇదే సినిమాను టాలీవుడ్ లో వెంకటేశ్, పవన్ కల్యాణ్ ‘గోపాల గోపాల’గా రీమేక్ చేయగా.. తెలుగులోనూ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ‘ఓ మై గాడ్’ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. ‘ఓ మై గాడ్-2’  పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా పంకజ్ త్రిపాఠి కీలకపాత్రలో నటిస్తున్నాడు. 

అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. చేతిలో ఢమరుకం పట్టుకుని జుట్టును విరబోసుకుని ఉన్న అక్షయ్ లుక్ ఆసక్తికకరంగా ఉంది. ఫస్ట్ లుక్ ను బట్టి ఈ సినిమాలో అక్షయ్ శివుడిగా కనిపించనున్నారు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bollywood
Akshay Kumar
Oh My God 2
release date
poster

More Telugu News