Etela Rajender: హుటాహుటిన ఢిల్లీకి పయనమైన ఈటల.. కీలక పదవి దక్కే ఛాన్స్!

Etala Rajender went to Delhi
  • బీజేపీ పెద్దలతో సమావేశం కానున్న ఈటల
  • ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం
  • రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన

తెలంగాణ బీజేపీ కీలక నేత, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయల్దేరారు. ఈరోజు ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈటలకు కీలక పదవిని అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఈటల సంతృప్తిగా లేరని... పదవి తప్ప, అధికారం లేదని ఆయన భావిస్తున్నట్టు చెపుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. 

  • Loading...

More Telugu News