Miss World: మూడు దశాబ్దాల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు

  • 1996లో ఇండియాలో చివరిసారి జరిగిన అందాల పోటీలు
  • ఇప్పటి వరకు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఆరుగురు భారతీయ సుందరాంగులు
  • 71వ మిస్ వరల్డ్ ఫైనల్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
India to host 2023 Miss World

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ సుందరాంగిని ఎన్నుకునే ఈ పోటీలకు విశ్వ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై అందరి దృష్టి ఉంటుంది. ఈ పోటీలను నిర్వహించే అవకాశం అన్ని దేశాలకు రాదు. కానీ, ఈ ఏడాది మన దేశానికి ఆ అవకాశం వచ్చింది. 2023 మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరగబోతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలను నిర్వహించే అవకాశం మన దేశానికి దక్కింది. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో నవంబర్ లో జరగబోతున్నాయి. చివరి సారి ఇండియాలో 1996లో అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు జరిగాయి. 

ఈ సందర్భంగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ మాట్లాడుతూ.. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో జరగబోతున్నాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. భారత్ లోని విభిన్న సంస్కృతులను, ప్రపంచ స్థాయి ఆకర్షణలను, సుందరమైన లొకేషన్లను ప్రపంచంతో పంచుకోబోతున్నామని తెలిపారు. 

మన దేశం నుంచి ఇప్పటి వరకు మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలుగా నిలిచింది వీరే:

  • రీటా ఫరియా - 1966
  • ఐశ్వర్యా రాయ్ - 1994
  • డయానా హేడెన్ - 1997
  • యుక్తా ముఖి - 1999
  • ప్రియాంకా చోప్రా - 2000
  • మానుషి చిల్లార్ - 2017

More Telugu News