Team India: ఆసీస్ బౌలర్ల మూకుమ్మడి దాడి... కష్టాల్లో టీమిండియా

  • డబ్ల్యూటీసీ ఫైనల్
  • తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 ఆలౌట్
  • సగం పరుగులు కూడా చేయకుండానే 5 వికెట్లు కోల్పోయిన భారత్
  • తలో వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టిన ఆసీస్ బౌలర్లు
Team Indian in deep troubles

డబ్ల్యూటీసీ టెస్టులో టీమిండియా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడంలేదు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేయగా.... రెండో రోజు లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట చివరికి 38 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. 

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉండగా, చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో అజింక్యా రహానే (29 బ్యాటింగ్), కేఎస్ భరత్ (5 బ్యాటింగ్) ఉన్నారు. 

తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలో దిగిన భారత జట్టును ఆసీస్ బౌలర్లు హడలెత్తించారు. ఆసీస్ జట్టులో ప్రతి బౌలర్ వికెట్ తీయడం విశేషం. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, బోలాండ్, కామెరాన్ గ్రీన్, నాథన్ లైయన్ తలో వికెట్ తీసి భారత్ ను దెబ్బకొట్టారు. 

టీమిండియా లైనప్ లో రవీంద్ర జడేజా చేసిన 48 పరుగులే అత్యధికం. జడేజా దూకుడుగా ఆడి 7 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 15, శుభ్ మాన్ గిల్ 13, పుజారా 14, కోహ్లీ 14 పరుగులు చేశారు.

More Telugu News