Team India: రెండో రోజు ఆసీస్ దూకుడు తగ్గింది!

  • లండన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ స్కోరు 422-7
  • సెంచరీ హీరోలు హెడ్, స్మిత్ లను అవుట్ చేసిన భారత బౌలర్లు
Lunch break in WTC Final 2nd day

డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో రోజు ఆటలో భారత బౌలర్ల విజృంభణతో ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఓవర్ నైట్ స్కోరు 327-3 తో ఇవాళ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది. ఈ ఒక్క సెషన్ లోనే టీమిండియా 4 వికెట్లు తీయడంతో ఆసీస్ స్కోరింగ్ రేటు మందగించింది. ప్రస్తుతం క్రీజులో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ (22 బ్యాటింగ్), కెప్టెన్ పాట్ కమిన్స్ (2 బ్యాటింగ్) ఉన్నారు. 

టీమిండియా బౌలర్లలో షమీ 2, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు, రెండో రోజు ఆట ఆరంభంలో సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ తన దూకుడు కొనసాగించాడు. హెడ్ కేవలం 174 బంతుల్లోనే 163 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 25 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 268 బంతుల్లో 19 ఫోర్లతో 121 పరుగులు సాధించాడు. వీరిద్దరూ అవుట్ కావడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. 

కామెరాన్ గ్రీన్ (6), మిచెల్ స్టార్క్ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. గ్రీన్ ను షమీ అవుట్ చేయగా... సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ అక్షర్ పటేల్ విసిరిన అద్భుతమైన త్రోకు స్టార్క్ బలయ్యాడు.

More Telugu News