YS Avinash Reddy: వివేకా హత్య కేసులో ఏ8 అవినాశ్ రెడ్డి.. కోర్టుకు తెలిపిన సీబీఐ

CBI mentions YS Avinash Reddy as A8 in Viveka murder case
  • వివేకా హత్య కేసులో అవినాశ్ నిందితుడేనన్న సీబీఐ
  • హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాశ్ పాత్ర ఉందని వెల్లడి
  • శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాశ్ హత్యాస్థలికి చేరుకున్నారన్న సీబీఐ
వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడేనని సీబీఐ స్పష్టం చేసింది. కోర్టుకు అందజేసిన నివేదికలో అవినాశ్ ను ఏ8గా పేర్కొంది. అవినాశ్ 8వ నిందితుడని నివేదించింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ పలు విషయాలను పేర్కొంది. హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో భాస్కర్ రెడ్డి, అవినాశ్ ల పాత్ర ఉందని చెప్పింది. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు వీరిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలిపింది. 

శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాశ్ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని చెప్పింది. ఉదయం 5.20కి ముందే అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. కేసు పెట్టొద్దని, పోస్ట్ మార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్, శివశంకర్ రెడ్డి చెప్పారని వెల్లడించింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకుమారులు భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.   

YS Avinash Reddy
YS Vivekananda Reddy
A8
CBI

More Telugu News