adipurush: 10వేల మందికి ఆదిపురుష్ సినిమా టిక్కెట్లు ఉచితం.. ఎవరికంటే..!

10 thousand Adipurush tickets for free
  • తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు ఉచితం
  • గూగుల్ ఫామ్ పూర్తి చేసి , వివరాలు నమోదు చేసి టిక్కెట్ పొందాలి
  • ప్రకటించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్

ఆదిపురుష్ సినిమా టిక్కెట్లను 10 వేల మందికి పైగా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి టిక్కెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు 'సెలబ్రేటింగ్ ఆదిపురుష్' గూగుల్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. వివరాలు నమోదు చేసిన వారికి టిక్కెట్లు పంపిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 95050 34567 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News