preethi: మెడికో ప్రీతి హాస్టల్ గదిని తెరిచిన పోలీసులు

Preethi hostel room openced after long time
  • నాలుగు నెలల తర్వాత హాస్టల్ గది ఓపెన్
  • కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో తెరిచిన గది
  • ప్రీతి లగేజీని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి... హాస్టల్ గదిని వరంగల్ పోలీసులు బుధవారం తెరిచారు. కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 409లో ప్రీతి ఉండేది. ఈ గది నాలుగు నెలలుగా మూసి ఉంది. ఈ గదిని కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో తెరిచారు. హాస్టల్ గదిని తెరిచాక అక్కడ ప్రీతి ఉపయోగించిన వస్తువులను చూసి తల్లిదండ్రులు విలపించారు. ప్రీతి లగేజీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News