Anurag Thakur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు 5 డిమాండ్లు పెట్టిన రెజ్లర్లు.. అవి ఏంటంటే..!

  • అనురాగ్ ఠాకూర్ తో ముగిసిన రెజ్లర్ల భేటీ
  • చర్చలకు హాజరైన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్
  • బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్
Wrestlers put 5 demands before Anurag Thakur

కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ ల భేటీ ముగిసింది. అనురాగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రెజ్లర్లు ఐదు డిమాండ్లను కేంద్ర మంత్రి ముందు ఉంచారు. కేంద్ర ప్రభుత్వం, రెజ్లర్ల మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన తొలి సమావేశం ఎలాంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు ఉంచిన ఐదు డిమాండ్లు ఇవే:

  • ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. 
  • ఫెడరేషన్ చీఫ్ గా మహిళను నియమించాలి. 
  • రెజ్లింగ్ ఫెడరేషన్ లో బ్రిజ్ భూషణ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఉండకూడదు. 
  • కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు తమపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలి. 
  • మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలి.

మరోవైపు తన గ్రామంలో ఒక కార్యక్రమానికి వెళ్లిన కారణంగా అనురాగ్ తో భేటీకి మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ హాజరుకాలేదు.

More Telugu News