Maruti Suzuki: జిమ్నీ వచ్చేసింది.. ఎస్ యూవీల్లో గట్టి పోటీ

  • నేటి నుంచే డెలివరీలు ఆరంభం
  • మొత్తం ఆరు వేరియంట్లలో విక్రయాలు
  • రూ.12.74 నుంచి రూ.15.05 లక్షల మధ్య ధర
  • ఆఫ్ రోడ్ లో మంచి పనితీరు చూపిస్తుందంటున్న మారుతి సుజుకీ
Maruti Suzuki Jimny launched in India

కొంత కాలంగా వాహన ప్రియులను ఊరిస్తున్న మారుతి జిమ్నీ ఎట్టకేలకు బుధవారం భారత మార్కెట్లో విడుదలైంది. ఇది ఐదు డోర్లతో కూడిన ఆఫ్ రోడ్ వాహనం. ఒక విధంగా మహీంద్రా అండ్ మహీంద్రా థార్ ను పోలిన వాహనమని చెప్పుకోవచ్చు. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.74 లక్షలు. వేరియంట్ ను బట్టి గరిష్ఠ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.15.05 లక్షలు. మారుతి నెక్సా అవుట్ లెట్లలో దీన్ని విక్రయించనున్నారు. 

జిమ్నీ కోసం జనవరి 12 నుంచి ఇప్పటి వరకు 30,000 బుకింగ్ లు నమోదయ్యాయి. నేటి నుంచే డెలివరీలు మొదలు పెట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. నెలవారీ రూ.33,550 ఈఎంఐతో జిమ్నీని సొంతం చేసుకోవచ్చని తెలిపింది. జిమ్నీ జెటా ఎంటీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.12,74,000. జెటా ఏటీ ఎక్స్ షోరూమ్ ధర రూ.13,94,000. ఆల్ఫా ఎంటీ ఎక్స్ షోరూమ్ ధర రూ.13,69,000. ఆల్ఫా ఏటీ ఎక్స్ షోరూమ్ ధర రూ.14,89,000. ఆల్ఫా ఎంటీ (డ్యుయల్ టోన్) ధర రూ.13,85,000. ఆల్ఫా ఏటీ డ్యుయల్ టోన్ ధర రూ.15,05,000. ఇలా మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది.

ఆఫ్ రోడ్ లో ఈ వాహనం మంచి పనితీరు చూపిస్తుందని కంపెనీ అంటోంది. 1.5 లీటర్ కే సిరీస్ ఇంజన్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో ఉంటుంది. 4 స్పీడ్ ఆటోమేటిక్, 4 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. ఎంటీ వేరియంట్ లీటర్ కు 16.94 కిలోమీటర్ల మైలేజీని, ఏటీ వేరియంట్ 16.39 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకీ తెలిపింది.

More Telugu News