Mustafa: నాశనం కావాలంటూ ప్రజలపై వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు.. స్థానికుల ఆగ్రహం

  • గుంటూరు 9వ డివిజన్లో కాలువల శంకుస్థాపనకు వెళ్లిన ముస్తఫా
  • బాగున్న కాలువలను ఎందుకు పగలగొడతారన్న స్థానికులు
  • ఎమ్మెల్యే, స్థానికుల మధ్య వాగ్వాదం
Locals fires on YSRCP MLA Mustafa

గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరులోని 9వ డివిజన్ లో డ్రైనేజీ కాలువల శంకుస్థాపనకు ఈరోజు ముస్తఫా వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. తమ వీధిలో కాలువలు బాగున్నాయని, వాటిని పగులగొట్టి కొత్తవాటిని వేయడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గుతుందని స్థానికులు చెప్పారు. కావాలంటే అండర్ గ్రౌండ్ కాలువ వేయాలని అన్నారు. 

ఈ క్రమంలో స్థానికులకు, ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే స్థానికులపై శాపనార్థాలు పెట్టారు. నాశనం కావాలని అన్నారు. దీంతో, ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజైనా తమ వద్దకు వచ్చావా అని మండిపడ్డారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

More Telugu News