కెనడాలో 700 మంది భారత విద్యార్థుల ఆందోళన
- డిపోర్టేషన్ లెటర్లు అందుకోవడంతో రోడ్డెక్కిన స్టూడెంట్స్
- రాత్రిపూట చలిలోనూ ఆందోళన కొనసాగింపు
- ఎక్కువ మంది విద్యార్థులు పంజాబ్ కు చెందినవారే
మిస్సుసాగా సిటీలోని కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) ప్రధాన కార్యాలయం ముందు భారతీయ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. లంగర్ తరహాలో రోడ్డుపైనే వంటలు చేసుకుని తింటూ, రాత్రుళ్లు కూడా అక్కడే నిద్రిస్తున్నారు. చదువులో టాపర్లుగా ఉన్న తమకు ఫేక్ అడ్మిషన్ లెటర్లతో కెనడా రావాల్సిన అవసరం ఏముందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమలో కొంతమంది ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయామని చెప్పారు. బాధిత విద్యార్థులపైన చర్యలు తీసుకోవడమేంటని వారు నిలదీస్తున్నారు. సాయం చేయాలంటూ ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రాజర్ ను అభ్యర్థించగా.. న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారని విద్యార్థులు చెబుతున్నారు. కాగా, కెనడాలోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్నారు.