Kriti Sanon: తిరుమల ఆలయం ముందు కృతి సనన్ ను హత్తుకుని, ముద్దు పెట్టిన ఆదిపురుష్ దర్శకుడు.. విమర్శల వెల్లువ

Aadipurush director Om Raut kisses Kriti Sanon before Tirumala temple
  • ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న కృతి, ఓం రౌత్
  • ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘటన
  • సెండాఫ్ ఇచ్చాడంటున్న యూనిట్ సభ్యులు
ప్రభాస్, కృతి సనన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో ఘనంగా జరిగింది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని వీరు దర్శించుకున్నారు. అనంతరం గుడి వెలుపల కృతి సనన్ ను ముద్దుపెట్టుకుని, హత్తుకున్నారు. ఆ తర్వాత కృతి కారెక్కి వెళ్లిపోయారు. మరోవైపు, ఈ సన్నివేశాన్ని చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిత్రమైన స్థలంలో ఈ పనేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 

దీనిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ... తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని, ఇది పిక్నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ కాదని అన్నారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయ మహాద్వారం ముందు ఇలాంటి పని చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నార్త్ కల్చర్, సినిమా కల్చర్ ఏదైనా కావొచ్చు, ఇలాంటివి ఇంట్లోనో లేదా మారిషస్ లోనే చేసుకోవాలని... దేవుడి సన్నిధిలో ఇది సరికాదని అన్నారు. 

మరోవైపు, కృతి సనన్ కు ఫ్లైట్ టైమ్ అవుతోందని, ఆమె హడావుడిగా బయల్దేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో దర్శకుడు ఆమెకు సెండాఫ్ ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో అసభ్యత లేదని అంటున్నారు.
Kriti Sanon
Om Raut
Kiss
Tollywood
Bollywood

More Telugu News