Prabhas: 'ఆదిపురుష్' ఈవెంటులో అందంగా మెరిసిన కృతి సనన్!

Adi Purush Pre Release Event
  • అందరి దృష్టి 'ఆదిపురుష్' పైనే 
  • సీతాదేవి పాత్రను పోషించిన కృతి సనన్ 
  • ఈవెంటులో బ్లాక్ శారీలో మెరిసిన నాయిక
  • ఆమెను చూసేందుకు ఎగబడిన జనాలు 
  • ఆమె నటన పట్ల ప్రభాస్ ప్రశంసలు
కృతి సనన్ తెలుగు సినిమాతోనే కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. '1 నేనొక్కడినే' సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు ఆమె ఏ భాషలో కూడా ఏ సినిమా చేయలేదు. ఆ తరువాత కూడా ఆమె తెలుగులో 'దోచేయ్' చేసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వలన, ఆమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలపైనే దృష్టిపెట్టింది. బాలీవుడ్ లో గట్టిపోటీ ఉంటుంది .. అయినా ఆ పోటీని తట్టుకుంటూ, తనకంటూ ఆమె ఒక క్రేజ్ ను సంపాదించుకోగలిగింది. అలాంటి కృతి సనన్ 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా సీతాదేవి పాత్రలో కనిపించనుంది. సీతాదేవి పాత్ర చేసిన నాయికలకు సహజంగానే ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కృతి సనన్ బ్లాక్ శారీలో అందంగా మెరిసింది. సీతాదేవి పాత్రను పోషించిన ఆమెను చూడటానికి జనాలు ఎగబడ్డారు. కృతి మంచి ఆర్టిస్ట్ కావడం వల్లనే ఈ పాత్రకి ఆమెను అనుకోవడం జరిగిందనీ, ఆమె పెర్ఫార్మెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రభాస్ ప్రశంసించడం విశేషం. సింపుల్ గా .. చక్కని చిరునవ్వుతో కనిపిస్తూ కృతి సనన్ మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. 
Prabhas
Krithi Sanon
Om Raut
Adipurush

More Telugu News