Chandrababu: ప్రతి రోజూ టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తేనో, అడ్డుకుంటేనో తప్ప ఈ ప్రభుత్వానికి పొద్దు గడవడం లేదు: చంద్రబాబు

Chandrababu condemns TDP MLA Nimmala Ramanaidu arrest
  • నిన్న కొండపి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నేడు నిమ్మల రామానాయుడిని అదుపులోకి తీసుకున్న వైనం
  • రామానాయుడిని అరెస్ట్ చేసి వేధించారన్న చంద్రబాబు
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి రోజు టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తేనో,   అడ్డుకుంటేనో తప్ప ఈ ప్రభుత్వానికి పొద్దు గడవడంలేదని విమర్శించారు. 

నిన్న ప్రకాశం జిల్లాలో దళిత ఎమ్మెల్యే స్వామిని అరెస్ట్ పేరుతో హింసించిన పోలీసులు... నేడు దళితుల భూముల రక్షణ కోసం పోరాడుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని అరెస్ట్ చేసి వేధించారని ఆరోపించారు. ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించడం కాదని ఈ నియంతృత్వ పాలకులు తెలుసుకోవాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అక్రమాలు చేసే వైసీపీ నేతలకు... అక్రమాలపై పోరాటం చేసే టీడీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. మున్ముందు ప్రజలే మీకు గట్టిగా బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రామానాయుడిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Chandrababu
Nimmala Rama Naidu
Police
TDP
Andhra Pradesh

More Telugu News