Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • తీవ్ర ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు
  • 4 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే లాభాల్లోకి వెళ్లి, వెంటనే మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 4 పాయింట్ల లాభంతో 62,793కి చేరుకుంది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 18,599 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.13%), కోటక్ బ్యాంక్ (1.88%), టాటా మోటార్స్ (1.68%), యాక్సిస్ బ్యాంక్ (1.52%), మారుతి (1.42%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.98%), టెక్ మహీంద్రా (-1.88%), టీసీఎస్ (-1.69%), విప్రో (-1.09%), భారతి ఎయిర్ టెల్ (-0.62%).

More Telugu News