కర్నూలులో రైతుకు దొరికిన రూ.2 కోట్ల విలువైన వజ్రం
- కొనుగోలు చేసేందుకు పోటీ పడిన వజ్రాల వ్యాపారులు
- రూ.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న గుత్తి వ్యాపారి
- తొలకరి జల్లు కురవడంతో జిల్లాలో ఊపందుకున్న వజ్రాల వేట
ఇటీవల వర్షం కురవడంతో కర్నూలు జిల్లా మద్దెకర మండలంలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు అన్వేషణ మొదలుపెట్టారు. మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన రాయి దొరికింది. ఆ రాయిని అక్కడే అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరకు గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఆ రాయిని రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నాడని సమాచారం. ఈ వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం కూడా పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.