ఈ అభాగ్యులంతా ఎవరో? ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు!
- ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ లో 278 మంది మృతి
- 1,100 మందికి పైగా క్షతగాత్రులు
- ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన దాదాపు 900 మంది
మొత్తం 1,100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రింకేశ్ వెల్లడించారు. దాదాపు 200 మంది వివిధ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఐడెంటిఫై చేస్తున్న మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.