Nara Lokesh: కమలాపురంలో ఉన్నా కెన్యాకి పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా: నారా లోకేశ్

  • కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • కమలాపురం నియోజకవర్గం నుంచి కడప నియోజకవర్గంలోకి ప్రవేశం
  • వైసీపీ నేతలకు హెచ్చరికలు చేసిన లోకేశ్
  • కమలాపురంలో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి
  • నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేస్తామని హామీ
Lokesh warns YCP leaders

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడప శివారు అలంఖాన్ పల్లె వద్ద 1500 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ కడప నగరంలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మరికాసేపట్లో 1500 కిలోమీటర్లు చేరుతుందనగా, చెన్నూరు-కొండపేట బ్రిడ్జిపై 1500 అడుగుల భారీ యువగళం జెండా ప్రదర్శించారు. 1500 అడుగుల భారీ పతకాన్ని ప్రదర్శించిన కార్యకర్తలను లోకేశ్ అభినందించారు. ఐరన్ సర్కిల్ వద్ద లోకేశ్ పాదయాత్ర కడప అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

చంద్రన్న అభివృద్ధి, జగన్ విధ్వంసానికి నిదర్శనం హజ్ హౌస్!

చెన్నూరు హజ్ హౌస్ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఇది క‌డ‌ప జిల్లా చెన్నూరులో గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన హజ్ హౌస్. ముస్లిం మైనారిటీలపై తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమిది. రూ.28 కోట్లు కేటాయించి మేం హజ్ హౌస్ ను నిర్మిస్తే, వైసీపీ ప్రభుత్వం ఈ భవనాన్ని పాడుబెట్టి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసింది. చంద్రన్న అభివృద్ధికి, జగ‌న్ విధ్వంసానికి ప్రత్యక్ష నిద‌ర్శ‌నం ఈ భవనం" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.


హజ్ హౌస్ ను ప్రారంభిస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చాక హజ్ హౌస్ ని ప్రారంభిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని పెండింగ్ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. "మామ, అల్లుళ్ళకు కమలాపురం చాలా ఇచ్చింది. కమలాపురానికి మామ, అల్లుడు ఏం ఇచ్చారు?... గుండు సున్నా. 

టీడీపీని కమలాపురంలో గెలిపించండి. అభివృద్ధిని కమలాపురానికి పరిచయం చేస్తాం. టీడీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రెచ్చిపోతున్న వైసీపీ నాయకుల్ని వదిలిపెట్టను. కమలాపురంలో ఉన్నా కెన్యాకి పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా" అంటూ ఘాటుగా హెచ్చరించారు.

పిల్ల సైకోలను పంపడం కాదు...నేరుగా నువ్వేరా తేల్చుకుందాం!

చీకట్లో కోడిగుడ్లు వెయ్యడం, పిల్ల సైకోల్ని పంపడం కాదు జగన్... దమ్ముంటే నువ్వే నేరుగా రా తేల్చుకుందామని నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చెన్నూరు బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించారు. ప్రసంగం మొదలయ్యాక నమాజ్ విన్పించడంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి, తర్వాత ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ... "యువగళం దెబ్బకి జగన్ కి 70 ఎంఎం సినిమా కనపడుతోంది. కడప గడ్డపై యువగళం ప్రజాగర్జన చూసి జగన్ కి నిద్రపట్టడం లేదు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నాడు. నాపై కోడిగుడ్లు వేస్తే నీ కడుపు మంట తగ్గదు... ఈనో వాడుకో జగన్" అంటూ  సలహా ఇచ్చారు.


మీది పరదాల బతుకు... మాది యువగళం!

జగన్ ది పరదాల బ్రతుకు... నాది యువగళం... నా దారికి అడ్డు రావొద్దు... అడ్డొస్తే మీకు అడ్రెస్ లేకుండా చేస్తా అంటూ  నారా లోకేశ్ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. 

"తాడేపల్లి ప్యాలస్ లో బ్రోకర్ ఒకడు ఉన్నాడు. వాడి పేరు సజ్జల. ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం అవ్వాలని సంతకాలు సేకరించిన జగన్ కే మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్. సొంత బాబాయ్ ని లేపేసిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్. సొంత తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్. 

మానసిక వైకల్యంతో సైకోగా మారింది జగన్. లండన్ మందులు వాడుతుంది జగన్. ముందు ఆ విషయం తెలుసుకో ప్యాలస్ బ్రోకర్. గుర్తు పెట్టుకో... మీ సైకో బ్యాచ్ కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఈ లోకేశ్ మాత్రమే" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

భూబకాసురుడు రవీంద్రనాథ్ రెడ్డి!

కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్ 1 చేస్తాడని భారీ మెజారిటీతో రవీంద్రనాధ్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయనేం చేశారు అంటూ  లోకేశ్ ప్రశ్నించారు. "సీఎంకి మేనమామ నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి? అభివృద్ధి పరుగులు పెట్టాలి? 

కానీ ఇక్కడ సీన్ రివర్స్... అభివృద్ధి నిల్లు... అహంకారం, అవినీతి, భూకబ్జాలు ఫుల్లు. అభివృద్ధి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే పళ్లు రాలగొడతాడు రవీంద్రనాథ్ రెడ్డి. ఇసుక, మట్టి, గ్రావెల్ దందా, భూకబ్జాలకు కమలాపురాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు. 

కొందరికి తాగుడు అంటే వ్యసనం... మరి కొందరికి జూదం వ్యసనం... కమలాపురం ఎమ్మెల్యేకు మాత్రం భూకబ్జాలు అంటే వ్యసనం. పూర్వం బకాసురుడు ఊరికి ఒకరిని బలికోరినట్టుగా రవీంద్రనాథ్ రెడ్డి పేదలు, ప్రభుత్వ, చివరికి శ్మశాన భూముల్ని సైతం కబ్జా చేస్తున్నాడు. అందుకే పేరు మార్చాను ఆయన రవీంద్రనాథ్ రెడ్డి కాదు భూబకాసురుడు. సొంత పార్టీ వాళ్లను కూడా వేధించడం ఆయన స్పెషాలిటీ" అని వ్యంగ్యం ప్రదర్శించారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1509.4

*ఈరోజు నడిచిన దూరం 15.7 కి.మీ.*

*118వ రోజు పాదయాత్ర వివరాలు (6-6-2023)*

*కడప అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – కడప బిల్టప్ సర్కిల్లో రెడ్డి సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – కడప బిల్టప్ సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.20 – రామకృష్ణ కాలేజి వద్ద మీ-సేవ నిర్వాహకులతో సమావేశం.

4.40 – మాసిమా సర్కిల్ వద్ద బ్రాహ్మణ సామాజికవర్గీయులతో భేటీ.

5.00 – రెండవ గాంధీ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ.

5.10 – చెన్నూరు బస్టాండు వద్ద యూత్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం.

5.20 – మొదటి గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

5.40 – గోకుల్ లాడ్జి సర్కిల్ లో వైశ్య సామాజికవర్గీయులతో సమావేశం.

5.50 – కృష్ణదేవరాయలు సర్కిల్ లో నిరుద్యోగ యువతతో సమావేశం.

6.20 – శంకరాపురంలో స్థానికులతో సమావేశం.

6.50 – అప్సర సర్కిల్ లో డైలీవేజ్ వర్కర్లతో సమావేశం.

7.20 – ఎన్టీఆర్ సర్కిల్ లో కొండయ్యపల్లి వాసులతో సమావేశం.

8.10 – చిన్నచౌక్ లో స్థానికులతో సమావేశం.

9.10 – రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదుట విడిది కేంద్రంలో బస.

******

More Telugu News