heart attack: తీవ్రమైన గుండెపోటు ఘటనలు సోమవారమే ఎక్కువట.. తాజా అధ్యయనంలో వెల్లడి!

  • స్టెమీ రకమైన గుండెపోటుపై ఐర్లాండ్ పరిశోధన సంస్థ అధ్యయనం
  • 2013 నుండి 2018 వరకు 10,528 మందిపై పరిశోధన
  • ఆదివారం రోజు స్టెమీ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడి
Fatal Heart Attack More Likely To Happen On Monday

జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు తదితర కారణాలతో ఇటీవలి కాలంలో చాలామంది గుండెపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సోమవారం రోజునే తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే అవకాశమున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్టెమీ అనేది ఓ రకమైన గుండెపోటు. దీనిపై ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధన అధ్యయనం చేపట్టాయి. 2013 నుండి 2018 వరకు జరిపిన అధ్యయనంలో 10,528 మంది పేషెంట్ల సమాచారాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బ్రిటిష్ కార్డియో వాస్క్యులర్ సొసైటీ కాన్ఫరెన్స్ లో పరిశోధకులు వెల్లడించారు. ఆదివారం కూడా స్టెమీ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రత్యేకమైన ఈ స్టెమీ గుండెపోటు వారంలో మొదటి రోజు అంటే సోమవారం ఎక్కువగా కనిపిస్తోందని ఈ అధ్యయనం తెలిపింది. సోమవారం - స్టెమీ సంభావ్యతకు మధ్య బలమైన సంబంధాన్ని గుర్తించామని, ఇది గతంలో కూడా వెల్లడైందని తెలిపారు. అయితే సోమవారమే ఎక్కువగా ఈ గుండెపోట్లు ఎందుకు సంభవిస్తున్నాయో వివరించలేకపోయారు. అయితే ఈ కేసులు సోమవారం సంభవించడానికి కార్కాడియం రిథమ్ తో సంబంధం ఉందని గతంలోని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

More Telugu News