Andhra Pradesh: పీఆర్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎల్లుండి ఏపీ ప్రభుత్వ ప్రకటన!

AP Government will take decision on PRC and contract employees
  • బుధవారం నాడు కేబినెట్ భేటీ
  • కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అంగీకారం
  • 12వ వేతన సవరణ సంఘంపై నేడు ఉద్యోగ సంఘాలతో చర్చ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం పీఆర్సీపై ప్రకటన చేయనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఎల్లుండి నిర్వహించనున్న కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. 2014 జూన్ 2వ తేదీ నాటికి అయిదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనుంది.

 ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వేతన సవరణ సంఘంపై కూడా చర్చించారు. కేబినెట్ భేటీ సందర్భంగా ఎల్లుండి ప్రకటన విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News