Aaron Finch: టీమిండియాలో వాళ్లిద్దరినీ చూసుకోండి... ఆసీస్ జట్టుకు ఫించ్ సలహా

  • మే 7 నుంచి లండన్ ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్
  • ఐసీసీ టెస్టు టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ
  • ఇప్పటికే లండన్ చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్న ఇరు జట్లు
  • డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో అభిప్రాయాలను పంచుకున్న ఫించ్
Aaron Finch suggests Aussies should restrict Kohli and Pujara in order to win WTC Final

ఈ నెల 7 నుంచి లండన్ లోని ఓవల్ మైదానంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే లండన్ చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ కీలక అభిప్రాయాలు వెలిబుచ్చాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా జట్టులో ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ ఎంతో కీలకం అని, వాళ్లిద్దరినీ కట్టడి చేయగలిగితే ఆసీస్ కు విజయావకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు. అందుకే, ఆసీస్ జట్టు... పుజరా, కోహ్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపాడు. వాళ్లిద్దరికీ కళ్లెం వేసేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదని వివరించాడు.

కోహ్లీ గతేడాది అహ్మదాబాద్ టెస్టులో ఆసీస్ పై 186 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడని ఫించ్ గుర్తుచేశాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో తాను కోహ్లీతో కలిసి ఆడానని, అతడి ఆటలో లోపాలు తక్కువ అని వెల్లడించాడు. 

అదే సమయంలో ఫించ్ టీమిండియాకు కూడా ఓ సూచన చేశాడు. ఈ టెస్టు మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగించాలంటే ఆసీస్ బ్యాటింగ్ మూలస్తంభాలు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. స్మిత్, లబుషేన్ క్రీజులో కుదురుకున్నారంటే టీమిండియాకు కష్టాలు తప్పవని ఫించ్ అభిప్రాయపడ్డాడు.

More Telugu News