Brahmaji: అప్పుడే 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్న 'మెన్ టూ'

Men Too Movie OTT Release Date Confirmed
  • మే 26వ తేదీన థియేటర్లకు వచ్చిన 'మెన్ టూ'
  • యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా 
  • ఆశించిన స్థాయిలో లభించని రెస్పాన్స్ 
  • ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమానే 'మెన్ టూ'. క్రితం నెల 26వ తేదీనే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అమ్మాయిల బాధితులకు సంబంధించినవారి నేపథ్యంలో .. కామెడీ టచ్ తో ఈ కథ నడుస్తుంది. మౌర్య సిద్ధవరం నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా అప్పుడే 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను 'ఆహా'లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. చాలా తక్కువ సమయంలోనే ఓటీటీ సెంటర్ కి వచ్చేసిన సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. 

బ్రహ్మాజీ ... నరేశ్ అగస్త్య .. మౌర్య .. హర్ష .. సుదర్శన్ .. రియా .. ప్రియాంక శర్మ ప్రధానమైన పాత్రలను పోషించారు. థియేటర్స్ వైపు నుంచి ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ లభించలేదు. ఓటీటీ సెంటర్లో ఏ స్థాయిలో సందడి చేస్తుందనేది చూడాలి.
Brahmaji
Naresh Agasthya
Harsha
Mourya

More Telugu News