Odisha train accident: మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్

  • తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించేలా సాయం అందిస్తామని ప్రకటన
  • ప్రమాద స్థలం వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి
  • రెండు రోజుల్లో ట్రాక్ పునరుద్ధరణ పూర్తి
Odisha train accident Ashwini Vaishnaw gets emotional says responsibility not over

ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ భావోద్వేగంగా స్పందించారు. గత శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో 275 మంది మరణించగా, 1,000 మందికి పైగా గాయపడడం తెలిసిందే. మృతుల్లో ఇంకా అధిక శాతం మందిని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా ప్రమాద స్థలం వద్దే ఉంటూ సహాయక, పునరుద్ధరణ సేవలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. దెబ్బతిన్న రైలు మార్గాన్ని పునరుద్ధరించి తిరిగి రైలు సర్వీసులను ప్రారంభించినట్టు మంత్రి ప్రకటించారు. 

అయితే, ఇంతటితో తమ బాధ్యత ముగిసినట్టు కాదన్నారు. తప్పిపోయిన వ్యక్తులను ఆందోళన చెందుతున్న వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంపై దృష్టి పెడతామని తెలిపారు. మా లక్ష్యం తప్పిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులు వేగంగా గుర్తించేలా చేయడమే. మా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పుతోనే ఘోర ప్రమాదం జరిగినట్టు మంత్రి ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ప్రమాదానికి బాధ్యులను సైతం గుర్తించినట్టు చెప్పారు. రైల్వే సేఫ్టీ కమిషనర్, సీబీఐ దర్యాప్తులో నిజాలు వెలుగు చూడనున్నాయి.

More Telugu News