ఒడిశా రైలు ప్రమాదం: కన్నీరు పెట్టిస్తున్న ఓ తండ్రి వెతుకులాట.. వీడియో!
- కొడుకు కోసం శవాల ముసుగు తీసి చూస్తున్న తండ్రి
- ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కనిపించని కొడుకు
- 288కి చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య
మార్చురీలో నేలపై వరుసగా పడుకోబెట్టిన మృతదేహాల దగ్గరికి వెళ్లి ఒక్కొక్క శవంపైన ముసుగు తొలగిస్తూ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ వీడియో చూసిన వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది. ఇంకా చాలామంది ఆచూకీ దొరకడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.