Vijayanagaram District: పవన్‌పై అభిమానం.. వెడ్డింగ్ కార్డుపై జనసేన పార్టీ హామీల ముద్రణ

Janasena party worker gets party manifesto printed on his wedding card
  • జనసేన అధినేతపై అభిమానాన్ని వినూత్న శైలిలో చాటుకున్న విజయనగరం జిల్లా వాసి
  • తన పెళ్లి ఆహ్వాన పత్రికపై వారాహి, జనసేన హామీల ముద్రణ
  • స్థానికంగా ఆసక్తి రేకెత్తించిన వెడ్డింగ్ కార్డు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు ఓ పార్టీ కార్యకర్త. తన పెళ్లి ఆహ్వాన పత్రికపై ఏకంగా పార్టీ హామీలను ముద్రించి పవన్ అంటే తనకెంతటి అభిమానమో కళ్లకుకట్టినట్టు చూపించాడు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన లచ్చిపతుల రంజిత్ కుమార్ పార్టీ వింగ్ ఐటీ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. 

కాగా, శనివారం ఆయన వివాహం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధం చేసిన ఆహ్వాన పత్రికల కవరుపై పవన్ కల్యాణ్‌ వారాహి, లోపల పార్టీ ఇచ్చిన హామీలను ప్రచురించి జనసేనకు మరింత ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ కార్డు అతడి స్నేహితులు, బంధువుల్లో ఆసక్తి రేకెత్తించింది.

  • Loading...

More Telugu News